ధనుష్, శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ ఆరంభం.!

ధనుష్, శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ ఆరంభం.!

Published on Jan 18, 2024 1:02 PM IST


కోలీవుడ్ వెర్సటైల్ హీరో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “కెప్టెన్ మిల్లర్” తో తన కెరీర్ లో మరో మంచి హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత ధనుష్ లైనప్ పై మంచి ఆసక్తి నెలకొంది. తమిళ్ సహా తెలుగు దర్శకులతో ధనుష్ సాలిడ్ లైనప్ ని సెట్ చేసుకోగా ఈ లిస్ట్ లో అవైటెడ్ చిత్రం ధనుష్ మరియు దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ కూడా ఒకటి.

మరి ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ చిత్రం ఎట్టకేలకి ఈరోజు ఆరంభం అయ్యింది. ధనుష్ కెరీర్ లో 51వ సినిమాగా ఇది స్టార్ట్ కాగా ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కింగ్ నాగార్జున కూడా ఒక కీలక పాత్ర ఈ సినిమాలో చేస్తున్నారు. మరి ఈరోజు హైదరాబాద్ లో అయితే చిత్ర యూనిట్ సమక్షంలో ముహూర్త కార్యక్రమాలతో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో ధనుష్ సహా నిర్మాతలు పుస్కర్ రామ్ మోహన్ రావు, భారత్ నారంగ్ అలాగే సునైల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఎప్పుడప్పుడా అని చూస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పై రానున్న రోజుల్లో మరిన్ని డీటెయిల్స్ రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు