ధనుష్ తో ‘శ్రీకారం’ డైరెక్టర్ ?

ధనుష్ తో ‘శ్రీకారం’ డైరెక్టర్ ?

Published on Apr 1, 2024 9:00 AM IST

‘శర్వానంద్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా ‘శ్రీకారం’ అనే సినిమా తీశాడు దర్శకుడు కిషోర్ బి. ఐతే, తాజాగా తమిళ హీరో ధనుష్ తో కిషోర్ బి ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ధనుష్ కి కిషోర్ బి ఓ కథ చెప్పాడని, ధనుష్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని టాక్. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తన బ్యానర్ లో నిర్మించనున్నారు. మరి ధనుష్ ఇమేజ్ కోసం కిషోర్ బి ఎలాంటి కథ రాశాడో చూడాలి.

నిజానికి కిషోర్ బి, నితిన్ తో సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ధనుష్ పేరు వినిపిస్తోంది. ధనుష్ అయితేనే తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం జరుగుతుందని కిషోర్ బి ఫీల్ అవుతున్నాడట. ఈ కాంబినేషన్ ను దిల్ రాజే లైన్ లో పెట్టినట్లు టాక్. ధనుష్ తన కొత్త ప్రాజెక్టు పూర్తి కాగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు