తమిళంలో 55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ‘అనేకుడు’.

తమిళంలో 55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ‘అనేకుడు’.

Published on Mar 7, 2015 2:45 PM IST

anekudu
ధనుష్, అమైరా దస్తూర్ జంటగా నటించిన ‘అనేకుడు’ సినిమా ఈ గురువారం తెలుగులో విడుదలైంది. ప్రేక్షకులు నుండి ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. తమిళంలో ఫిబ్రవరి 13న విడుదలైన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాదించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు 55 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని తమిళనాడు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కేవలం తమిళనాడులో 35 కోట్లు కలెక్ట్ చేసింది.

ధనుష్, అమైరాల నటన సినిమాకు పెద్ద ప్లస్ అని విమర్శకులు ప్రశంసించారు. డిఫరెంట్ స్క్రీన్‌ ప్లేతో కొనసాగే రొమాంటిక్‌ లవ్‌ స్టోరీకి ‘రంగం’ ఫేం కెవి ఆనంద్ దర్శకత్వం వహించారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ఎజిఎస్‌ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పాత్తి ఎస్‌. అఘోరం, కల్పాత్తి. ఎస్‌. గణేష్‌, కల్పాత్తి. ఎస్‌. సురేష్‌ లు సినిమాను నిర్మించారు.

తాజా వార్తలు