ధనుష్ ‘మరియన్’ రిలీజ్ డేట్

ధనుష్ ‘మరియన్’ రిలీజ్ డేట్

Published on Jul 20, 2015 11:04 AM IST

Mariyaan-(2)

మన తెలుగులో సినిమాలకి భాషా భేదం లేకుండా ప్రేక్షకాదరణ ఉంటుంది. పరభాషా హీరో అయిన సరే ఒక సినిమాతో తను మెప్పించాడంటే చాలు, ఇక అతని సినిమాలు ఇక తెలుగులో వస్తూనే ఉంటాయి. అలా కొలవెరి డీ సాంగ్ తో బాగా ఫేమస్ అయిన ధనుష్ హీరోగా నటించిన మూడు సినిమాలు – రఘువరన్ బి.టెక్, పందెం కోళ్ళు, అనేకుడు ఈ ఏడాది తెలుగులో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అదే బాటలోనే ధనుష్ నటించిన మరో తమిళ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఆ సినిమా పేరు ‘మరియన్’.

ఇదే ‘మరియన్’ పేరుతో 2013లో తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాక, మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అదే పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే ఎఆర్ రెహమాన్ అందించిన పాటలను తెలుగులో రిలీజ్ చేసారు. అలాగే తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేస్తున్న ఎస్వీఆర్ మీడియా వారు ఈ సినిమాని జూలై 31న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. భరత్ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ సరసన పార్వతి హీరోయిన్ గా నటించింది.

తాజా వార్తలు