
ధనుష్ నటించిన ‘రఘువరన్ BTech’ ఇక్కడ మంచి విజయం సాధించడంతో తన పాత హిట్ చిత్రాలను వెలికితీసేపనిలో వున్నారు. ఇటీవలే ధనుష్ కి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘ఆడుకులం’ సినిమాను తెలుగులో ‘పందెంకోళ్ళు’ పేరుతొ అనువదించారు. ఇప్పుడు ధనుష్ 2013లో నటించిన ‘మరియన్’ సినిమాను తెలుగులోకి తీసుకురానున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ట్రైలర్ ని నిన్న విడుదలచేశారు.
ఒక్కరాత్రిలో హీరో యిపోవడం కేవలం సినిమా రంగానికి మాత్రమే చెల్లుతుందని ధనుష్ మరోసారిరుజువు చేశాడు. గత కొన్నేళ్ళుగా తన సినిమాలు డబ్ అవుతున్నా ఆదరణకి నోచుకోకపోవడంతో డీలా పడ్డ ధనుష్ ఒక్క హిట్ తో రేస్ లోకి వచ్చేశాడు. ఈ సినిమా ఆంధ్రా తెలంగాణాలలో కలిపి 4కోట్లు వసూలు చేసింది. ధనుష్ ప్రస్తుతం కే.వి ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అనేకుడు’ సినిమా త్వరలో విడుదలకానుంది

