‘సీతా పయనం’ నుంచి ‘బసవన్న’ సాంగ్ రిలీజ్

Untitled 46

యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘సీతా పయనం’ నుంచి ‘బసవన్న’ అనే మాస్ సాంగ్ విడుదలైంది. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా వెండితెరకు పరిచయమవుతున్నారు. యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా పోషిస్తున్న ప్రత్యేక పాత్రను ఎలివేట్ చేస్తూ ఈ పాటను చిత్రీకరించారు.

అనూప్ రూబెన్స్ అందించిన ఎనర్జిటిక్ బాణీకి, కాసర్ల శ్యాం రాసిన పవర్ ఫుల్ లిరిక్స్ తోడై ఈ పాట ఆకట్టుకుంటోంది. నకాస్ అజిజ్, ఎల్. కీర్తన ఈ గీతాన్ని ఆలపించగా.. లలితా శోభి, శ్రష్టి వర్మ కొరియోగ్రఫీ సమకూర్చారు. ఈ పాటలో ధ్రువ సర్జా స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. అర్జున్ కూడా ఈ చిత్రంలో ఓ విశిష్ట పాత్రలో కనిపించనున్నారు.

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, నిరంజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు, జి. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version