రజిని దర్బార్ మూవీ నుండి లిరికల్ సాంగ్ వచ్చేసింది. ‘దుమ్ము, ధూళి..’ అనే ఈ సాంగ్ మాస్ బీట్ లో ఓ రేంజ్ లో ఉంది. ఇక ఈ పాట బాల సుబ్రమణ్యం పాడటంతో ఒకప్పటి రజిని మార్క్ సాంగ్స్ ని గుర్తుచేసేలా ఉంది. అరుణాచలం, నరసింహ, భాషా వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో రజిని ఇంట్రడక్షన్ సాంగ్స్ ఎంతటి ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే. దర్బార్ చిత్రంలోని దుమ్ము ధూళి సాంగ్ కూడా అంతటి విజయం సాధింస్తుందనిపిస్తుంది. ఈ పాటకు సాహిత్యం అనంత శ్రీరామ్ అందించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ పాటతో మరో మారు తన సత్తా చాటారు.
దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రజిని సరసన మరోమారు నయనతార చేశారు. గతంలో వీరిద్దరూ చంద్రముఖి, కథానాయకుడు చిత్రాలలో కలిసి నటించారు. దర్బార్ మూవీ ముంబై నేపథ్యంలో నడిచే మాఫియా స్టోరీ కాగా రజిని పోలీస్ అధికారిగా చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 15న విడుదల అవుతుంది.
సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


