బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రమే “ధురంధర్” (Dhurandhar). మరీ ఎక్కువ హైప్ లేకుండానే థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు భారీ లెవెల్లో వసూళ్లతో రికార్డులు కొల్లగొడుతుంది. మెయిన్ గా హిందీ మార్కెట్ లో ఈ సినిమాకి నెవర్ బిఫోర్ నంబర్స్ ని అందిస్తున్నారు. అక్కడ ఈ ఏడాదిలో వచ్చిన ‘ఛావా’ రోరింగ్ రికార్డులు అందులో పుష్ప 2 రికార్డులు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఇపుడు ధురంధర్ భారీ మార్జిన్ లతో బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా లేటెస్ట్ గా మూడో శనివారం వసూళ్లు ఒక హిస్టారిక్ నెంబర్ సెట్ చేసింది.
Pushpa 2, Chhaava Numbers – హిందీలో ఛావా, పుష్ప 2 నెంబర్స్ (3వ శనివారం)
గతంలో అల్లు అర్జున్ పుష్ప 2 సెట్ చేసిన నెంబర్లే ఒకింత షాకింగ్ అనుకుంటే విక్కీ కౌశల్ ఛావా దానిని కూడా బద్దలు కొట్టింది. పుష్ప 2 కి కేవలం హిందీలోనే మూడో శనివారం 20.5 కోట్ల నెట్ వసూళ్లు వస్తే ఛావా మరో 2 కోట్లు ఎక్కువ సాధించింది.
భారీ మార్జిన్ తో ధురంధర్
ఈ మూడో శనివారం ధురంధర్ (Dhurandhar), ఛావా సెట్ చేసిన 22.5 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ ని ఏకంగా 13 కోట్లకి పైగా మార్జిన్ తో క్రాస్ చేసి మొత్తం 35.7 కోట్ల నెట్ వసూళ్లు ఈ సినిమా సాధించింది. ఇలా ఓవరాల్ గా నిన్నటివరకు కేవలం ఇండియా లోనే ధురంధర్ సుమారు 539 కోట్ల నెట్ వసూళ్లు సాధించి దుమ్ము లేపింది.


