ఇప్పుడు ఇండియన్ సినిమాని షేక్ చేస్తున్న సెన్సేషనల్ హిట్ చిత్రమే “ధురంధర్” (Dhurandhar OTT). ఈ ఏడాదికి ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచే ఛాన్స్ ఉన్న ఈ సినిమా ఇప్పటికీ అదే ర్యాంపేజ్ కొనసాగిస్తూ భారీ వసూళ్లు రాబడుతుంది. అయితే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు గ్రాసర్ అయినటువంటి పుష్ప 2 వసూళ్లు బ్రేక్ చేస్తున్న ఈ సినిమాకి ఓ షాకింగ్ ఓటిటి డీల్ కూడా జరిగినట్టు ఇప్పుడు కొన్ని వార్తలు వైరల్ గా మారాయి.
Shocking price for Dhurandhar OTT – 285 కోట్లతో ధురంధర్ ఓటిటి హక్కులు?
రణ్వీర్ సింగ్ (Ranveer Singh Dhurandhar) నటించిన ధురంధర్ సినిమాకి ఏకంగా 285 కోట్లై దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ చెల్లించిట్టుగా పలు రూమర్స్ మొదలయ్యాయి. ఇక ఇది పుష్ప 2 ఓటిటి డీల్ కంటే అత్యధికం అంటూ కూడా ఓ ప్రచారం జరుగుతుంది. ఇదే నిజం అయితే మాత్రం ఇండియన్ ఓటిటి హిస్టరీ లోనే ఒక షాకింగ్ డీల్ అని చెప్పాల్సిందే.
మరో వెర్షన్ కూడా ఉంది..
నిజానికి ధురంధర్ (Dhurandhar Movie) పై లేటెస్ట్ గా స్టార్ట్ అయ్యిన ప్రచారం కేవలం హైప్ లో రీచ్ కోసం చేస్తున్న ప్రచారమే అనుకోవాలి. ఎందుకంటే ధురంధర్ రెండు భాగాలకు కలిపి నెట్ ఫ్లిక్స్ ముందే 130 కోట్లకి పైగా వెచ్చించి కొనేసినట్టుగా ఎప్పుడో టాక్ వచ్చింది. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యిన కొత్త వెర్షన్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
Dhurandhar OTT release time – ఓటిటిలో రిలీజ్ ఎప్పుడు?
ధురంధర్ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఆగే సూచనలు చూపించడం లేదు. అయితే ఈ సినిమాని మేకర్స్ 8 వారాల తర్వాతే విడుదల చేస్తామన్నట్టు డీల్ చేసుకున్నట్టు సమాచారం. సో జనవరి ఎండింగ్ లో అలా సినిమా రావచ్చు.
