జోరుగా సాగుతున్న ‘డిక్టేటర్’ ఆడియో లాంచ్ వర్క్

dectetor
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి వేదికని సిద్దం చేస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న మొట్ట మొదటి సినీ వేడుక ఇది, కావున దీనిని అత్యంత వైభవంగా చేసి అందరినీ అమరావతి వైపు ఆకర్షించాలని బాలకృష్ణ ప్లాన్ చేసాడని ఇది వరకే తెలియజేశాం. అలాగే ఈ ఆడియో ఫంక్షన్ కి ఇరు రాష్ట్రాల నుంచి సుమారు లక్షమందికి పైగా అభిమానులను ఇన్వైట్ చేయనున్నారని కూడా తెలిపాము.

దానికి తగ్గట్టుగానే అమరావతిలో వేదిక పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. బాలయ్య దగ్గరుండి మరీ ఆడియో లాంచ్ కి వచ్చే అభిమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఉండాలే అన్ని భద్రతా ఏర్పాట్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వేడుకకి సంబందించిన అన్ని పనులు జోరుగా సాగుతున్నాయి. ఆడియో లాంచ్ కి ఒక రోజు ముందే అన్ని పనులను పర్ఫెక్ట్ గా పూర్తి చేయనున్నారు. ఈ వేడుకకి పలువురు రాజకీయ నేతలు కూడా హాజరు కానున్నారు.

బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. శ్రీవాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా ఎరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

Exit mobile version