వినాయక చవితికి ‘డిక్టేటర్’ టీజర్?

Balayya-1
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా చేస్తోన్న 99వ సినిమా ‘డిక్టేటర్’, సెట్స్‌పైకి వెళ్ళక ముందునుంచే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే హైద్రాబాద్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత యూరప్‌లో నిన్ననే మరో భారీ షెడ్యూల్ మొదలుపెట్టింది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

బాలయ్య రేంజ్ హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి ఎంటర్‌టైనింగ్ అంశాలను కూడా నింపుకున్న డిక్టేటర్ సినిమా ద్వారా ఎరోస్ ఇంటర్నేషనల్ తెలుగు సినిమా నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. ఇక ఇదిలా ఉంటే.. వినాయక చవితికి డిక్టేటర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారికంగా సినిమా యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇక తెలుగు ఇండస్ట్రీ స్టార్ రైటర్లైన కోన వెంకట్, గోపీ మోహన్, బీవీఎస్ రవి, శ్రీధర్ శ్రీపాన, డైమండ్ రత్నంలు ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చారు. అంజలి, సోనాల్ చౌహాన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Exit mobile version