ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘దేవర సీక్వెల్’ కచ్చితంగా ఉంటుందని ఇప్పటికే ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. మరి ‘దేవర పార్ట్-2’ షూట్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందో ఇంకా క్లారిటీ లేదు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం అక్టోబర్ నుంచి ఈ సినిమాకి తారక్ డేట్స్ ఇచ్చాడని.. కాబట్టి అక్టోబర్ మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
అన్నట్టు, దేవర సీక్వెల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ రెడీ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ పై వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు కొరటాల శివ ‘దేవర పార్ట్-2’ కథలో చాలా మార్పులు చేసి షూట్ కోసం కసరత్తులు చేస్తున్నారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
