చిరుకి సిస్టర్ గా విజయశాంతి ?

Published on May 25, 2020 9:25 am IST

మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ లో విజయశాంతి నటించబోతుందని, మంజు వార్యర్ పాత్రలోనే విజయశాంతి కనిపించబోతుందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది. మరి మెగాస్టార్ కి సిస్టర్ పాత్రలో విజయశాంతి నటిస్తుందా అంటే.. అలాంటిది ఏమి లేదని చెబుతుంది చిత్రబృందం.

ఇంకా ఈ సినిమా కోసం ఎవర్ని ఫైనల్ చేయలేదని.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని దర్శకుడు సుజిత్ తెలిపారట. ఇక తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో మెగాస్టార్ కొన్ని కీలకమైన మార్పులను సూచించగా.. ఆ మార్పులను పూర్తి చేసాడు సుజిత్. ముఖ్యంగా హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సన్నివేశాలు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయట.

సంబంధిత సమాచారం :

More