“డాకు మహారాజ్” పవర్ఫుల్ ప్రీప్రొడక్షన్ పోస్టర్స్ చూసారా?

“డాకు మహారాజ్” పవర్ఫుల్ ప్రీప్రొడక్షన్ పోస్టర్స్ చూసారా?

Published on Feb 23, 2025 5:02 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఊర్వశి రౌతేలా అలాగే ప్రగ్యా జైస్వాల్ ఫీమేల్ లీడ్ లో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో అంచనాలు నడుమ ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం అభిమానులు అంచనాలు అందుకొని బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇక లేటెస్ట్ గా ఓటిటిలోకి వచ్చి కూడా అదరగొడుతున్న ఈ చిత్రంపై కొన్ని సాలిడ్ పోస్టర్స్ ఇపుడు వైరల్ గా మారాయి. బాలయ్య ఈ చిత్రం కోసం మొత్తం మూడు డిఫరెంట్ లుక్స్ ప్రిపేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో మాస్ లుక్ ‘డాకు’ షేడ్ కూడా ఒకటి. అయితే దీనిపై ప్రీప్రొడక్షన్ లో ప్లాన్ చేసిన కొన్ని పోస్టర్స్ ని డిజైనర్ విశ్వనాధ్ సుందరం రివీల్ చేయడం జరిగింది.

మరి వీటిలో బాలయ్య మరింత పవర్ఫుల్ గా కనిపిస్తున్నారని చెప్పాలి. సాలిడ్ మేకోవర్ తో బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ వర్క్ లో కూడా ఇలాంటివి అఫీషియల్ గా వచ్చి ఉంటే ఇంకా ఇంపాక్ట్ గట్టిగా ఉండేది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి గతంలో కూడా RRR, రాధే శ్యామ్ లాంటి సినిమాలకి కూడా ఈ తరహా ప్రీప్రొడక్షన్ పోస్టర్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు