‘సోలో బ్రతుకే సో బెటరు’ అంటున్న మెగా హీరో

‘సోలో బ్రతుకే సో బెటరు’ అంటున్న మెగా హీరో

Published on Sep 24, 2019 2:02 AM IST

sai dharam tej3

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా కొత్త సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొత్త దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటరు’ అనే భిన్నమైన టైటిల్ అనుకుంటున్నారట. ఈ పేరును ‘మనీ’ చిత్రంలోని ‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు’ అనే పాట ద్వారా స్పూర్తి పొంది తీసుకున్నారట.

టైటిల్ బట్టి సినిమా లవ్ కమ్ కామెడీ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. అక్టోబర్ నుండి సెట్స్ మీదికి వెళ్ళనున్న ఈ సినిమాలో నభ నటేష్ కథానాయకిగా నటించనుంది. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రతిరోజు పండగే’ సినిమాలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు