శ్రీకాంత్ అడ్డాల కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ !

Published on Jan 19, 2019 3:34 pm IST


‘కొత్త బంగారు లోకం , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సాఫ్ట్ టైటిల్స్ తో సినిమాలను తెరకెక్కించి హిట్లు కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఆ తరువాత ముకుంద , బ్రహ్మోత్సవం చిత్రాలతో పరాజయాలను చవిచూశాడు. బ్రహ్మోత్సవం అయితే శ్రీకాంత్ కెరీర్ నుఇబ్బందుల్లో పడేసింది. ఈచిత్రం దెబ్బకు దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకొని ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని తెరకెక్కించే పనిలో వున్నాడు ఈ డైరెక్టర్.

ఈ చిత్రానికి కూడా విన్నూతమైన టైటిల్ ఫిక్స్ చేశాడట. ‘కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు నటించనున్నారని సమాచారం. గీతా ఆర్ట్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఫై తర్వలోనే అధికారిక ప్రకటన వెలుబడనుంది. మరి ఈ చిత్రం తోనైనా శ్రీకాంత్ అడ్డాల హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More