సాయి కొర్రపాటి మంచి అభిరుచి కలిగిన నిర్మాత అని మనకు తెలిసినదే. రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడితో ‘ఈగ’ తీసి పెద్ద నిర్మాతల జాబితాలో చేరిపోయిన ఈయన ప్రస్తుతం మాస్, క్లాస్ ప్రేక్షకులపై దృష్టి పెడుతున్నారు. అందాల రాక్షసి, లెజెండ్, ఊహలు గుసగుసలాడే సినిమాల ద్వారా అతని టేస్ట్ తెలుస్తుంది
ఇప్పుడు తండ్రి, కోడకులు ఒకే అమ్మాయిని ప్రేమించే వినూత్న కధను ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా ద్వారా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రాజమౌళి శిష్యుడైన త్రికోటి డైరెక్టర్ గా పరిచయంకానున్నాడు. నాగ శౌర్య, అజయ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సనా మక్బుల్ హీరోయిన్


