దిల్ రాజు సొంతమైన ‘గోపాల గోపాల’ నైజాం రైట్స్

దిల్ రాజు సొంతమైన ‘గోపాల గోపాల’ నైజాం రైట్స్

Published on Dec 29, 2014 3:49 PM IST

gopala-gopala-dill-raju
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న టాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్ర టీం ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకి బిజినెస్ పరంగా డిస్ట్రిబ్యూటర్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజాగా ఈ సినిమా నైజాం రైట్స్ ని నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ఎన్ఆర్ఏ బేసిస్ ప్రకారం సుమారు 13.4 కోట్లకి దిల్ రాజు రైట్స్ ని సొంతం చేసుకున్నాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన గోపాల గోపాల చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ యు ట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఆడియో ఆల్బంని జనవరి 1న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ ని చూసిన ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఫస్ట్ లుక్ చాలా బాగుందని అంటున్నారు. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. వెంకటేష్ కి జోడీగా శ్రియ శరన్ నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపిస్తాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు