ఆగడు హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు

Published on Jun 13, 2014 4:09 am IST

Dil-Raju-bags-Aagadu

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా ఉత్తరాంధ్ర హక్కులను సొంతం చేసుకున్నాడు

ఈ సినిమా హక్కులను దాదాపు 5కోట్లు పెట్టి సొంతంచేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాతోపాటూ రుద్రమదేవి సినిమా హక్కులను కూడా దిల్ రాజు సొంతం చేసుకున్న విషయం తెలిసినదే

ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే చాలా మంచి బిజినెస్ చేస్తుందని టాక్. ఇటీవలే విడుదలచేసిన టీజర్ మంచి స్పందనను అందుకుంది

ఆగడు శాటిలైట్ హక్కులను దాదాపు 10కోట్లకు సొంతంచేస్కున్నారు. మహేష్ బాబు, తమన్నా హీరో హీరోయిన్స్. ఒక మాంచి మాస్ పాటలో మహేష్ శృతి హాసన్ తో కలిసి రచ్చ లేపనున్నాడు

సంబంధిత సమాచారం :