బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , పూజ హెగ్డే హీరో హీరోయిన్లు గా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై అభిషేక్ నామ నిర్మిస్తున్న చిత్రం’ సాక్ష్యం’.ఇటీవల రిలీజ్ అయినా ఈ చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నైజాం ప్రాంత హక్కులని ప్రముఖ నిర్మాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత ‘దిల్ రాజు’ సొంతం చేసుకున్నాడు. అయితే ఎంత మొత్తానికి ఈ సినిమా రైట్స్ ని దక్కించుకున్నాడో తెలియాల్సిఉంది.
ప్రకృతి నేపధ్య కథ తో సాగె ఈ సినిమాలో జగపతి బాబు , శరత్ కుమార్ , మీనా మొదలగు ప్రముఖ తారాగణం నటిస్తున్నారు . ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14 న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు


