వారసుడి కోసం క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసిన దిల్ రాజు

వారసుడి కోసం క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసిన దిల్ రాజు

Published on Dec 24, 2019 11:56 AM IST

dil1

ఇప్పటికే ఎంతో మంది అగ్ర నిర్మాతలు, కథానాయకుల వారసులు హీరోలుగా పరిచయం కావడం మనం చూశాం. వారి బాటలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు వారసుడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. దిల్ రాజు తన సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డిని హీరోగా ఇంట్రడ్యూజ్ చేస్తూ ఇదివరకే సినిమాను లాంఛ్ చేశారు. ఇప్పటికే సినిమా ప్రీప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు పూర్తికావడంతో టైటిల్ ఫైనలైజ్ చేశారట.

చిత్రం యూత్ ఫుల్ ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది కాబట్టి ‘రౌడీ బాయ్స్’ అనే క్రేజీ టైటిల్ అనుకుంటున్నారట. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష డైరెక్ట్ చేయనున్నారు. జనవరి నుండి రెగ్యులర్ షూట్ మొదలవుతుందట. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు