దిల్ రాజు- సతీష్ వేగ్నేశ కలయికలో మరో చిత్రం !

Dil Raju Satish Vignesh

శతమానం భవతి అద్భుతమైన సినిమాను అందించిన సతీష్ వేగ్నేశకు మరో అవకాశం ఇస్తూ దిల్ రాజు నిర్మించిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. నితిన్, రాశి ఖన్నా జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకులముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రం తొలి రోజు నుండే మిక్సడ్ టాక్ ను తెచ్చుకోవడంతో కలెక్షన్స్ కూడా మోస్తారుగా వస్తున్నాయి.

ఇక ఈ సినిమా ఫలితం అటుంచితే దిల్ రాజు మరో సారి సతీష్ వేగ్నేశ తో సినిమాను నిర్మించనున్నాడు. ‘థాంక్యూ’ అనే టైటిల్ తో రానున్న ఈసినిమాకి మీకు ఎలా చెప్పాలో అనేది ఉప శీర్షిక. ఓవ్యక్తి జీవితానికి సంభందించిన కథతో తెరకెక్కనున్న ఈచిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలు ఉండనున్నాయి. త్వరలోనే ఈ చిత్రంలో నటించే నటినటులను ప్రకటించనున్నారు.

Exit mobile version