విజయ్ దేవరకొండ తో దిల్ రాజు మరో చిత్రం!?

విజయ్ దేవరకొండ తో దిల్ రాజు మరో చిత్రం!?

Published on Apr 30, 2024 3:27 PM IST

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ది ఫ్యామిలీ స్టార్ (The Family star). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మాతగా, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, రాజావారు రాణిగారు ఫేమ్ డైరెక్టర్ రవి కిరణ్ కోల దర్శకత్వం లో సినిమా రానుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ ఈ చిత్రం తో పాటుగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో మరొక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు