కరోనా ఆ నిర్మాతను బాగా ఇబ్బంది పెట్టేస్తుంది.

Published on Mar 22, 2020 8:47 pm IST

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న మూడు సినిమాలు కరోనా పడ్డాయి. ఓ మూవీ విడుదల ఆగిపోగా, రెండు చిత్రాల షూటింగ్ నిలిచిపోయింది. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి నాని,సుధీర్ హీరోలుగా తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ వి విడుదల నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్ర విడుదల ఏప్రిల్ కి వాయిదా వేశారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఇప్పట్లో ఈ చిత్రం విడుదలయ్యేట్లు కనిపించడం లేదు.

ఇక పవన్ హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ చిత్రీకరణ కూడా నిలిచిపోయింది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరగా మే లో విడుదల కావాల్సివుంది. ఇక జెర్సీ హిందీ రీమేక్ షూటింగ్ సైతం ఆగిపోయింది. దీనితో నిర్మాత దిల్ రాజు ఎప్పుడూ చూడని కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సినిమా విడుదల, షూటింగ్స్ నిలిచిపోవడం అనేక విధాలుగా ఆయనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More