ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు – దిల్ రాజు !

Published on Jan 18, 2019 9:43 pm IST

ఇటీవల సరైన హిట్లు లేక డీలా పడ్డ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసంక్రాంతికి ఎఫ్ 2 అనే చిత్రం తో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఈనెల 12న విడుదలైన ఈచిత్రం కేవలం 5రోజుల్లోనే 32కోట్ల షేర్ ను రాబట్టి ప్రాఫిట్ జోన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా హైద్రాబాద్లో ఈరోజు భారీ సక్సెస్ మీట్ ను నిర్వహించారు.

ఈ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ మా బ్యానర్ నుండి వచ్చిన చిత్రాల్లో హైయెస్ట్ ప్రాఫిట్స్ ను తీసుకొచ్చిన చిత్రం ఎఫ్ 2 అని మా సంస్థనుండి 31వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం హిట్ అవుతుందని అనుకున్నా కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందనుకోలేదు అని ఈచిత్రాన్ని ఇంతపెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రంతో అనిల్ వరసగా నాలుగు విజయాలను ఖాతాలో వేసుకున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More