దిల్ రాజు సమర్పణలో మణిరత్నం ‘ఓకే బంగారం’.

దిల్ రాజు సమర్పణలో మణిరత్నం ‘ఓకే బంగారం’.

Published on Feb 13, 2015 3:16 AM IST

Dil-Raju-manirathnam
మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘ఓకే కన్మణి’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ తెలుగు ఈ సినిమాను విడుదల చేస్తుంది. తెలుగులో ‘ఒకే బంగారం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ వేసవి ప్రారంభంలో ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదొక ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టొరీ. సినిమాలో క్యారెక్టర్లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. మణిరత్నం ‘ఒకే బంగారం’తో తన స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూపిస్తాడు. అని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ సినిమా విజయంపై ధీమాను వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. తమిళంలో సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ పతాకంపై సుహాసిని మణిరత్నం, మణిరత్నంలు ‘ఒకే కన్మణి’ను నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు