ప్రారంభమైన దిల్ రాజు ‘కేరింత’

Kerintha
10 సంవత్సరాల కెరీర్లో కొత్త వాళ్ళతో, స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దిల్ రాజు సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. దిల్ రాజు ప్రస్తుతం కొత్త వాళ్ళను హీరో హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘వినాయకుడు’ ఫేం సాయి కిరణ్ అడవి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకి టైటిల్ ‘కేరింత’.

గత కొంత కాలంగా నూతన నటీనటుల ఎంపిక కోసం స్టార్ హంట్ ప్రోగ్రాం ని నిర్వహించారు. అది ముగియడంతో ఈ సినిమాకి సంబందించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం దిల్ రాజు ఆఫీసులో జరిగాయి. మొదటి షాట్ కి వివి వినాయక్ క్లాప్‌ నివ్వగా,అల్లు అరవింద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, శ్యాంప్రసాద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించాడు. జూన్ 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సెప్టెంబర్ కల్లా సినిమాని పూర్తి చేసి అక్టోబర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

మిక్కీ జె మేయర్ సంగీతం, అబ్బూరు రవి మాటలు అందిస్తున్న ఈ సినిమా ద్వారా ఎడిటర్ గా మధు, సినిమాటోగ్రాఫర్ గా విశ్వ, కొరియోగ్రాఫర్ గా విజయ్ ని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు.

Exit mobile version