బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘టైసన్ నాయుడు'(Tyson Naidu) సినిమా విడుదలపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. ‘భైరవం’ నిరాశపరిచినా, ‘కిష్కిందపురి’ సక్సెస్‌తో ఫామ్‌లోకి వచ్చిన బెల్లంకొండకు ఈ మాస్ హిట్ చాలా అవసరం. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మూడేళ్ల క్రితమే మొదలైన ఈ ప్రాజెక్ట్, సరైన అప్‌డేట్స్ లేక అయోమయంలో పడిపోయింది.
ఈ జాప్యానికి ప్రధాన కారణం ‘అఖండ 2’ ఫలితమేనని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న 14 రీల్స్ సంస్థ, అఖండ సీక్వెల్ లాభాలతో టైసన్ నాయుడును పూర్తి చేయాలని భావించింది. అయితే బాక్సాఫీస్ వద్ద బాలయ్య-బోయపాటిల మ్యాజిక్ రిపీట్ కాకపోవడంతో నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేశారు. అయితే పండగకు కూడా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో ఈ మూవీ అసలు థియేటర్లకు వస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెల్లంకొండకు ఒక పక్కా సోలో హిట్ ఇచ్చే ఈ ప్రాజెక్ట్‌కు ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి.


