మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఢిల్లీవాలా..’ అనే గీతాన్ని ఈనెల 20న విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను ఆదిత్య అయ్యంగార్, గీతా మాధురి, రాహుల్ నంబియర్ పాడడం జరిగింది. హీరో రవితేజ తత్వాన్ని అతని నేపధ్యాన్ని తెలియజేసేదిలా ఉన్న ఈ సాంగ్ విశేష ఆదరణ దక్కించుకుంది. తమన్ తనదైన శైలిలో రవి తేజ ఇంట్రడక్షన్ సాంగ్ కంపోజ్ చేశారు.
ఫిక్షనల్ స్టోరీ తో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా డిస్కో రాజా రూపొందుతోంది. ఇప్పటికే విడుదల చేసిన తొలి పాట, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం కార్తీక్ ఘట్టమనేని, సంభాషణలు అబ్బూరి రవి.’
సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


