దినేష్ తేజ్ ‘తత్వం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్!

దినేష్ తేజ్ ‘తత్వం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్!

Published on Jun 25, 2026 4:18 PM IST

Thatwam Movie Trailer

దినేష్ తేజ్, దష్విక.కె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘తత్వం’ చిత్ర ట్రైలర్‌ను చిత్ర బృందం హైదరాబాద్‌లో విడుదల చేసింది. అర్జున్ కోల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్ పతాకాలపై వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమాజంలో మన చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు.

ట్రైలర్ విడుదల కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడారు. సాఫ్ట్‌వేర్ రంగం నుంచి వచ్చిన అర్జున్ కోల ఎంతో అనుభవజ్ఞుడిలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఎడిటర్ విప్లవ్ నైషదం పేర్కొన్నారు. ఇదొక మంచి ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న థ్రిల్లర్ అని, సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉందని సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ తెలిపారు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా కథకు తగినట్లుగా నిర్మించారని, ప్రేక్షకులకు ఇది మంచి థియేట్రికల్ అనుభూతిని ఇస్తుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత భరత్ వెల్లడించారు.

కథ వినగానే తనకు బాగా నచ్చిందని, ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని హీరో దినేష్ తేజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా చాలా భిన్నంగా ఉంటుందని నిర్మాతలు వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి పేర్కొన్నారు. ఈ చిత్రానికి భరత్ పట్టి కెమెరామన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

Thatwam Movie Trailer

సంబంధిత సమాచారం

తాజా వార్తలు