#90’s టీమ్ నుండి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్!

ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో వచ్చినటువంటి #90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ టీవీ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఈ సిరీస్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. నవీన్ మేడారం ఈ సిరీస్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహారించారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది. శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడం జరిగింది.

ఫీచర్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టీచర్ అనే టైటిల్ ను ఖరారు చేసారు. హీరోయిన్ స్వాతి ఇందులో లీడ్ రోల్ లో నటిస్తుంది. రిలీజ్ చేసిన పోస్టర్ ను చూస్తుంటే, #90’s టీవీ సిరీస్ తరహా లోనే కామెడీ యాంగిల్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. సిద్దార్థ్ సదాశివుని ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, అరుణ్ తచోత్ ఎడిటర్ గా, అజీమ్ మొహమ్మద్ DOP గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Exit mobile version