సావాస దోషమా పరిస్థితుల ప్రభావమా…అజయ్ భూపతి?

సావాస దోషమా పరిస్థితుల ప్రభావమా…అజయ్ భూపతి?

Published on Sep 4, 2019 10:37 AM IST

దర్శకుడు అజయ్ ట్విట్టర్ లో చేసిన ఒక కామెంట్ రెండు రోజులుగా చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. ఆయన ఎవరినో ఉద్దేశిస్తూ చీప్ స్టార్ అని కామెంట్ పెట్టారు. ఐతే అది ఎవరు అనేది మాత్రం ఆయన వెల్లడించలేదు, కనీసం హింట్ కూడా ఇవ్వలేదు. ఐతే ఈ సంఘటనపై గత రెండు రోజులుగా సామజిక మాధ్యమాలలో, మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది.

ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక వర్ధమాన దర్శకుడైన అజయ్ భూపతి ప్రవర్తన విస్తుగొలుపుతుంది. చిత్ర పరిశ్రమలో మోసాలు, అవమానాలు, బెదిరింపులు అనేవి సర్వసాధారణం. కానీ వాటిని ఎవరు బహిర్గతం చేయరు. అందుకు కారణం, అది వారి కెరీర్ నే ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంటుంది. అందుకే పరిశ్రమలో ఒక స్థాయి గుర్తింపు వచ్చే వరకు ఎవరైనా అన్ని సైలెంట్ గా భరిస్తారు కానీ బయటపడరు. అజయ్ భూపతి అందుకు భిన్నంగా అలా కామెంట్ పెట్టడం సంచలంగా మారింది.ఆయన ఎదుర్కొన్న పరిస్థితులే ఆయనతో అలా చేయించాయా ?.

అజయ్ భూపతి వర్మ, పూరి లాంటి డైనమిక్ డైరెక్టర్స్ స్కూల్ నుండి వచ్చినవాడు. ఆయన ఎక్కువ సమయం గడిపేది కూడా వాళ్ళతోనే. అందుకే అజయ్ కి కూడా ఇలాంటి తెగింపు తత్త్వం అలవడిందా? ఇదంతా సావాస దోషమేనా? అని అనుమానం కలుగుతుంది. వర్మ గురించి ఆయన కాంట్రవర్సి కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక పూరి కూడా తక్కువ కాదు, మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టేస్తాడు. ఇటీవల పూరి మహేష్ పై చేసిన ఆరోపణలే అందుకు నిదర్శనం. వారి శిష్యుడైన అజయ్ భూపతి వారి బాటలోనే పయనిస్తున్నట్లున్నాడు. ఏదిఏమైనా అజయ్ కామెంట్ టాలీవుడ్ లో బాంబు పేల్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు