సుధీర్ బాబు రాంబో లాగా ఉంటాడు – అనిల్ రావిపూడి

సుధీర్ బాబు రాంబో లాగా ఉంటాడు – అనిల్ రావిపూడి

Published on May 30, 2024 3:00 PM IST

యంగ్ హీరో సుధీర్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం ‘హ‌రోం హ‌ర’ ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను జ్ఞాన‌సాగ‌ర్ ద్వార‌క తెర‌కెక్కిస్తుండ‌గా, పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైల‌ర్ ను ఆన్లైన్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు విడుద‌ల చేయ‌గా, ఆఫ్లైన్ లో ద‌ర్శ‌కులు అనిల్ రావిపూడి, సంప‌త్ నంది లు రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో ఉన్న ట్యాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు త‌న‌కంటూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.. క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డంలో సుధీర్ బాబుకి మంచి టేస్ట్ ఉంది.. మంచి ఫిజిక్ బాడీతో సుధీర్ బాబు రాంబో లాగా ఉంటాడు. ఈ సినిమాలో ఆయ‌న లుక్స్, డైలాగ్ డెలివ‌రీ సూప‌ర్బ్ గా ఉన్నాయి.. అంటూ చెప్పుకొచ్చారు.

సుధీర్ బాబుకి ఈ సినిమా మంచి విజ‌యాన్ని అందించాల‌ని.. ఈ ట్రైల‌ర్ క‌ట్ చూస్తుంటే ద‌ర్శ‌కుడు ద్వార‌క ప‌నిత‌నం అర్థ‌మ‌వుతుంద‌ని అనిల్ రావిపూడి అన్నారు. ఇక ఈ సినిమాలో న‌టించిన మిగ‌తా నటీన‌టులు, టెక్నీషియ‌న్స్ కు ఆయ‌న త‌న బెస్ట్ విషెస్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు