‘పుష్ప 2’ పై బాలీవుడ్‌ దర్శకుడు ప్రశంసలు

‘పుష్ప 2’ పై బాలీవుడ్‌ దర్శకుడు ప్రశంసలు

Published on Apr 15, 2024 6:29 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, పుష్ప 2: ది రూల్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ దర్శకుడు అనిల్‌ శర్మ ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించాడు. పుష్ప 2 టీజర్‌ చూసి.. ఎక్స్‌ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.

ఇంతకీ తన పోస్ట్‌ లో అనిల్‌ శర్మ ఏం మెసేజ్ పెట్టాడంటే.. ‘ఇప్పుడే ‘పుష్ప 2’ టీజర్‌ చూశాను. ఈ సినిమా కోసం నేను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ‘పుష్ప 2’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ లుక్‌, నటన అత్యద్భుతంగా ఉంది.’’ అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక పుష్ప 2 టీజర్ విషయానికి వస్తే.. టీజర్ యూట్యూబ్ ను షేక్ చేసింది. బన్నీ గెటప్ అండ్ సెటప్ అదిరిపోయాయి.

సుకుమార్ టేకింగ్, దేవిశ్రీప్రసాద్ నేపథ్యం సంగీతం టీజర్ కి బాగా ప్లస్ అయ్యాయి. మొత్తానికి టీజర్ లో అల్లు అర్జున్ ని మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో చూపించారు. దీంతో, ఈ టీజర్ సినిమా పై భారీ బజ్‌ని క్రియేట్ చేసింది. అందుకే, ‘పుష్ప 2’ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఆగస్టు 15న, 2024లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు