ఆత్మహత్యకు పాల్పడిన దర్శకుడు !
Published on May 17, 2018 12:59 pm IST

2016లో సందీప్ కిషన్, నిత్యా మీనన్లు జంటగా ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రాజసింహ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కెరీర్లోని ఒడిదుడుకులు, ఇతర వ్యక్తిగత సమస్యల వలన ఇబ్బందిపడుతున్న ఆయన అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారు.

ఈ సంఘటన ముంబైలో చోటుకుచేసుకుంది. అస్వస్థతకు గురైన ఆయన ప్రస్తుతం ముంబైలోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో ఈయన గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ‘రుద్రమదేవి’ చిత్రంలో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్రకు సంభాషణలు రాసి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook