కార్తికేయ 2 కోసం అద్భుత లొకేషన్స్..!

Published on Mar 9, 2020 10:51 pm IST

నిఖిల్ గత ఏడాది అర్జున్ సురవరం మూవీతో చాల కాలం తరువాత ఓ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనేక అడ్డంకుల మధ్య విడుదలైన ఆ చిత్రం పాజిటివ్ టాక్ తో నడించింది. ఆ చిత్రం తరువాత తన కెరీర్ లో బెస్ట్ మూవీగా ఉన్న కార్తికేయ సినిమాకు సీక్వెల్ ని స్టార్ట్ చేశాడు. ఇటీవలే తిరుపతి వేదికగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. కాగా దర్శకుడు చందూ మొండేటి కార్తికేయ సినిమా కొరకు బెస్ట్ లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నారు.

అందుకోసం ఆయన గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ వెళ్లినట్లు తెలుస్తుంది. సస్పెన్సు థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కార్తికేయ 2 మూవీ గత చిత్రానికి మించి భారీగా తెరకెక్కించాలని దర్శకుడు అనుకుంటున్నాడట. అందుకే ఈ మూవీ కోసం బెస్ట్ లొకేషన్స్ వెతికే పనిలో దర్శకుడు ఉన్నాడు. వివేక్ కూచిబొట్ల, టి జి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More