అన్న పేరు కలిసివచ్చేలా పేరు మార్చుకున్న దర్శకుడు !

కళ్యాణ్ రామ్, కాజల్ జంటగా నటించిన ఎంఎల్ఎ సినిమా శుక్రవారం విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించారు. కామెడి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ న్యూ లుక్ లో కనిపించడం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు ఉపేంద్ర మాధవ్ మీడియాతో ముచ్చటించారు.

శ్రీను వైట్ల దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన ఉపేంద్ర మాధవ్ డైరెక్షన్ ట్రైల్స్ ఉన్న సమయంలో నటుడు రఘు కారుమంచి తన దగ్గర ఉన్న కథ గురించి కళ్యాణ్ రామ్ తో చెప్పడం వల్ల సినిమా పట్టాలు ఎక్కినట్లు డైరెక్టర్ చెప్పారు. తన అన్న మాధవ రెడ్డి సపోర్ట్ ఉండడంతో దర్శకుడిగా మారానన్న ఉపేంద్ర మాధవ్, అన్న (మాధవ రెడ్డి) పేరు కలిసి వచ్చేలా ఉపేంద్ర మాధవ్ గా పేరు మార్చుకున్నట్లు వెల్లడించాడు.

Exit mobile version