ఇటీవల’ ఇరుంబు తిరై’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్ చిత్రం అధ్బుతమైన విజయాన్ని అందించింది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదలై విశాల్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఆయన సూపర్ హిట్ చిత్రం ‘సందకోడి’ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘ సందకోడి 2’ చిత్రంలో నటిస్తున్నారు. లింగుసామి తెరకెక్కిస్తున్న ఈచిత్రం యొక్క షూటింగ్ చివరిదశకు చేరుకుంది. విశాల్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 18న విడుదలకానుంది.
ఇక ఈ చిత్రం తరువాతవిశాల్ మరొ కొత్త సినిమాకి సైన్ చేశాడు. జయం రవి హీరోగా ‘బోగన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టిన లక్ష్మణ్, ఈ కొత్త చిత్రాన్నీ తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన వివరాలను వెల్లడించనున్నారు. ఇక బోగన్ చిత్రాన్ని తెలుగులో రవితేజ తో రీమేక్ చేయాలనీ లక్ష్మణ్ ఆ మధ్యన ప్రయత్నించినా ఎందుకో వర్క్ ఔట్ కాలేదు.


