“ఓయ్” రీరిలీజ్ సక్సెస్ పై దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

“ఓయ్” రీరిలీజ్ సక్సెస్ పై దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

Published on Feb 22, 2024 8:52 PM IST

లేటెస్ట్ గా మన టాలీవుడ్ సినిమా దగ్గర రీ రిలీజ్ కి వచ్చిన మంచి హిట్ అయ్యిన చిత్ర “ఓయ్”. హీరో సిద్ధార్థ్ నటించిన ఈ చిత్రం అప్పుడు రాణించకపోయినప్పటికీ ఇప్పుడు వాలెంటైన్స్ డే కానుకగా వచ్చిన ఈ చిత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకుంది. అయితే దర్శకుడు ఆనంద్ రంగ ఈ రీ రిలీజ్ పట్ల మొదట అంత ఎగ్జైటెడ్ గా కనిపించలేదు కానీ అప్పట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉంటూ రీ రిలీజ్ లో మరోసారి సినిమాని ఎంజాయ్ చేశారు.

కానీ లేటెస్ట్ గా సినిమా సక్సెస్ విషయంలో మాత్రం తాను ఎమోషనల్ అయ్యారు. ఈ ఓయ్ రీ రిలీజ్ న వరకు చాలా ఎమోషనల్. నిజంగా ప్రతి ఒక్కరికీ చాలా థాంక్స్ చెప్తున్నాను అని ఈరోజు చివరి రోజు కావడంతో ఆర్ కె సినీ ప్లేస్ లో రాత్రి 10 గంటల 50 నిమిషాల షో కి ప్లాన్ చేసుకుంటున్నాను అని తెలిపాడు. మొత్తానికి మాత్రం తాను అప్పుడు అందుకోని సక్సెస్ ని మాత్రం ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత చూసారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు