సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాతగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ నే “ధర్మన్”. పోస్టర్స్ తోనే క్రేజీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం ఓ రూమర్ సోషల్ మీడియాలో కోలీవుడ్ లో వైరల్ గా మారింది. ధర్మన్ ని పాపులర్ ఓటీటీ సిరీస్ ది గుడ్ డాక్టర్ లైన్ తో ఉంటుంది అని స్ప్రెడ్ చేసారు.
కానీ దర్శకుడు ఫైనల్ గా దీనిపై క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమాపై వస్తున్న వార్తలు ఫేక్ అని కొట్టిపారేశారు. సో ఫ్యాన్స్ కి ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా షూట్ ప్రస్తుతం షురూ కానుంది. అలాగే రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ లు నిర్మాణం వహిస్తున్నారు.
Fake News ! https://t.co/VBcqVgtjQr
— Ashwath Marimuthu (@Dir_Ashwath) June 26, 2026


