భారీ టార్గెట్ పెట్టుకున్న రవితేజ డైరెక్టర్.

Gopichand Malineni

మాస్ మహారాజ్ రవితేజతో హ్యాట్రిక్ హిట్ కి సిద్ధం అవుతున్నాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ శ్రీను, బలుపు మంచి విజయాలు అందుకున్నాయి. దీనితో హ్యాట్రిక్ మూవీపై మంచి అంచనాలున్నాయి. క్రాక్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. షూటింగ్స్ కి పర్మిషన్స్ కూడా వచ్చిన నేపథ్యంలో త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఐతే ఈ మూవీ తర్వాత ఓ స్టార్ హీరో కోసం అదిరిపోయే కథ సిద్ధం చేశానని.. త్వరలోనే ఆయనను కలిసి కథ చెబుతానని అంటున్నాడు గోపిచంద్.

తాజా ఇంటర్వ్యూలో గోపిచంద్ ఈ విషయాన్ని బయటపెట్టగా ఆ స్టార్ హీరో ఎవరు అన్నది సస్పెన్సు గా మారింది. గతంలో ఈయన బాల కృష్ణ, పవన్ కళ్యాణ్ తో మూవీ చేసే ఆలోచన ఉంది అన్నారు. వారిద్దరిలో ఒకరయ్యే అవకాశం కలదు. ఇక ఈ మధ్య విజయాల పరంగా వెనుకబడ్డ రవితేజ ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నారు. శృతి హాసన్, రవితేజకు జంటగా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version