అయోధ్య “రామ్ లల్లా” ఆశీర్వాదం తీసుకున్న మిస్టర్ బచ్చన్ టీమ్!

అయోధ్య “రామ్ లల్లా” ఆశీర్వాదం తీసుకున్న మిస్టర్ బచ్చన్ టీమ్!

Published on Apr 18, 2024 5:02 PM IST


డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, మాస్ మహారాజ రవితేజ (Raviteja) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ (Mr Bachchan). ఈ చిత్రం లో భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన 30 రోజుల కీలక షెడ్యూల్ ఉత్తర్ ప్రదేశ్ లో పూర్తి అయ్యింది. ఇదే విషయాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో వెల్లడించారు.

అయితే అయోధ్య రామ మందిరం ను సందర్శించిన డైరెక్టర్ హరీష్ శంకర్ అండ్ టీమ్ రామ్ లల్లా ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ను కూడా హరీష్ శంకర్ పోస్ట్ చేశారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

https://twitter.com/harish2you/status/1780858659171709177

సంబంధిత సమాచారం

తాజా వార్తలు