డైరెక్టర్ జయంత్ సి పరాన్జీకి పితృవియోగం !

డైరెక్టర్ జయంత్ సి పరాన్జీకి పితృవియోగం !

Published on Jan 6, 2020 11:40 PM IST

Jayanth

సినీ దర్శకుడు జయంత్ సి పరాన్జీ తండ్రి డాక్టర్ పీటీ చంద్రమౌళి కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన చంద్రమౌళి చివరిదాకా ప్రజా సేవలో తరించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సంస్థలో సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ పదవీ విరమణ చేశారు.

చిత్తూరు జిల్లాలో సాధారణ కుటుంబంలో జన్మించిన డా. చంద్రమౌళి స్వయంకృషితో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఆయన వైద్యుల జాతీయ సంస్థకు రెండు పర్యాయాలు అఖిల భారత అధ్యక్షుడుగా వ్యవహరించారు. చంద్రమౌళి భౌతికకాయానికి జనవరి 8న మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయి.

123తెలుగు.కామ్ తరఫున ‘డా. చంద్రమౌళి’ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు