బాలీవుడ్ స్టార్ హీరోతో క్రిష్ ?

Published on May 6, 2019 9:04 am IST

దర్శకుడు క్రిష్ ప్రస్తుతం తన తరువాత సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ అలాగే పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మణికర్ణిక’ చిత్రం మొత్తానికి క్రిష్ ను బాగానే ఇబ్బంది పెట్టాయి. అందుకే ఈ సారి తన సినిమాలో కేవలం తన ముద్ర మాత్రమే స్పష్టంగా కనపడేలా, క్రిష్ మరో సినిమా చెయ్యటానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కోసం క్రిష్ ఓ కథ రాశారట. ఇప్పటికే అక్షయ్ తో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నాడు. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ చిత్రం బాలీవుడ్ లో భారీ విజయం సాధించింది కాబట్టి.. ఆ విజయం కారణంగా క్రిష్ తో సినిమా అంటే, అక్షయ్ వెంటనే అంగీకరించొచ్చు. మరి క్రిష్ ఈ సినిమాతోనైనా మళ్లీ భారీ హిట్ కొట్టాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

More