‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్ గాళ్స్’ (కానీ చాలా మంచోళ్లు). రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ (Bad Girls Movie Trailer) ను తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేశారు. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ పతాకాలపై నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.
ట్రైలర్ విడుదల అనంతరం మారుతి మాట్లాడుతూ.. “ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఐదుగురు కొత్త అమ్మాయిలతో, సరికొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు. టైటిల్ ‘బ్యాడ్ గాళ్స్’ అని ఉన్నా, సినిమా అంతా పాజిటివ్‌గా ఉంటుంది. నేటి తరం యువతుల ఆలోచనా విధానాన్ని, వారు కోరుకునే అంశాలను ఇందులో చూపించారు” అని చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు.
దర్శకుడు ఫణి ప్రదీప్ మాట్లాడుతూ.. “జాతిరత్నాలు, మ్యాడ్ సినిమాల తరహాలో అమ్మాయిలు చేసే హిలేరియస్ కామెడీయే ఈ చిత్రం. అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం సినిమాకు ప్రధాన బలం” అని తెలిపారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.


