ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా మారుతి

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా మారుతి

Published on Sep 13, 2019 7:08 AM IST

యంగ్ డైరెక్టర్ మారుతి మెగా హీరో ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ప్రతిరోజు పండగే.దర్శకుడు మారుతీ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. కాగా ఇటీవల విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేష స్పందన లభిస్తుంది. సత్య రాజ్, ధరమ్ తేజ్ లు కలిసి వర్షం లో సందడి చేస్తున్నట్లున్న ఆ పోస్టర్ చూస్తుంటేనే అర్థం అవుతుంది, ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ ఆహ్లాదకర చిత్రం అని.

ప్రస్తుత కాలంలో ఆయన తీసిన భలే భలే మగాడివోయ్, మహానుభావుడు,బాబు బంగారం,శైలజారెడ్డి అల్లుడు చిత్రాలు ఆరోగ్యకరమైన కామెడీ తో తెరకెక్కి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుత చిత్రం ప్రతి రోజు పండుగే కూడా మారుతి చక్కని హాస్యం, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా తెరకెక్కించారని సమాచారం. మారుతి వరుసగా ఇలాంటి చిత్రాలు తీస్తూ పరిశ్రమలో తన మార్కు చిత్రాలతో దూసుకుపోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు