సూపర్ స్టార్ రజిని హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రెండు రోజుల క్రితం శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు హీరో రజిని, దర్శకుడు మురుగదాస్ మరియు చిత్ర నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన దర్శకుడు మురుగదాస్.. రవితేజ లేటెస్ట్ మూవీ క్రాక్ సెట్స్ ని సందర్శించారు. కిరాక్ మూవీ విశేషాలు తెలుసుకున్న ఆయన దర్శకుడు గోపి చంద్ తో పాటు చిత్ర యూనిట్ కి బెస్ట్ విశెష్ చెప్పారు.
మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న క్రాక్ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. రవితేజ ఈ చిత్రంలో మరోమారు పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా విడుదలైన రవితేజ లుక్ కేకగా ఉంది. సరస్వతి ఫిలిం డివిజన్స్ పతాకంపై బి మధు ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


