కల్కి మూవీ పై మరోసారి నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కల్కి మూవీ పై మరోసారి నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on May 29, 2024 9:45 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. నాగ్ అశ్విన్, ఆ చిత్ర కథానాయకుడు ప్రభాస్‌తో కలిసి హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ, కల్కి 2898 ADని చూసి థియేటర్ నుండి బయటికి వచ్చినప్పుడు ఆడియెన్స్ వింతగా భావిస్తారని నేను ఆశిస్తున్నాను. నేను ఎక్కడ ఉన్నాను? నేను ఈ ప్రపంచంలోకి తిరిగి వెళ్ళవచ్చా? అని అనుకుంటారు అంటూ చెప్పుకొచ్చారు.

జేమ్స్ కామెరూన్ యొక్క బ్లాక్‌బస్టర్ అవతార్ చూసిన తర్వాత నాగ్ అశ్విన్ కూడా అదే విధంగా ఫీల్ అయినట్లు తెలిపారు. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. దీపికా పదుకునే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు