కల్కి ఈవెంట్ లో బుజ్జి పై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కల్కి ఈవెంట్ లో బుజ్జి పై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on May 23, 2024 12:01 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898ఏ.డి (Kalki 2898AD). బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిశా పటాని లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా రిలీజ్ డేట్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. బుజ్జి – భైరవ ఈవెంట్ లో గ్రాండ్ గా బుజ్జి ఇంట్రో వీడియో ను రిలీజ్ చేశారు. వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. అమితాబ్ కి గ్లింప్స్ వీడియో మామూలుగా రిలీజ్ చేసి, బుజ్జి కోసం ఈవెంట్ చేయడం పట్ల స్పందించారు. బుజ్జి పేరు చిన్నది గా ఉంది కానీ, మామూలుగా ఉండదు. బుజ్జి మా అందరికీ చాలా స్పెషల్ అని అన్నారు. అంతేకాక ఈ వెహికిల్ ను ప్రిపేర్ చేయడానికి చాలా కస్తపడినట్లు పేర్కొన్నారు. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు