చెప్పిన టైంకే వస్తాం అంటున్న “సాహో” డైరెక్టర్

Published on May 30, 2019 2:00 am IST

ప్రభాస్ సాహో విడుదల ఆలస్యం అవనుందంటూ రెండు రోజులుగా వార్తలు ఇండస్ర్టీలో చక్కర్లు కొడుతున్నాయి.మ్యూజిక్ డైరెక్టర్స్ అద్ధాంతరంగా మ్యూజిక్ బాధ్యతలు వదిలేసి వెళ్లిపోవడం, ఇంకా పలుకరణాల ఇటువంటి వార్తలకు జీవంపోస్తున్నాయి.

డైరెక్టర్ సుజీత్ ని ఈ విషయం పై అడుగగా ఆయన కొంచెం ఘాటు గానే స్పందించారు. అసలు “సాహో” విడుదల ఆలస్యం కానుందన్న పుకార్లు అసలు ఎవరు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మేము అనుకున్న ప్రణాళిక ప్రకారం మూవీ ని ఎటువంటి సమస్యలు లేకుండా పూర్తి చేస్తూ వెళుతున్నాము, ఆగస్టు 15 అనేది విడుదల కు అనుకూల సమయము, ఆ టైములో ప్రేక్షకులు సినిమా ధియేటర్స్ కు రావడానికి ఇష్టపడతారు. అలాంటి మంచి సీజన్ మేము వదులుకోవాలనుకోవడం లేదు,అన్నారు.

ఆగస్టు 18న బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ “మిషన్ మంగళ్”, జాన్ అబ్రహం “బాట్లా హౌస్” అనే పెద్ద సినిమాల విడుదల ఉందన్న సుజీత్ అవి “సాహో” కి పోటీ గా భావించడం లేదని అన్నారు.

సంబంధిత సమాచారం :

More